ఆయన మరణాన్ని ప్రచారం చేయకండి – మంచు మనోజ్.!

213
Manchu Manoj:stop telecasting Hari Krishna post accident visuals..
- Advertisement -

నందమూరి హరికృష్ణ మరణంపట్ల సినీ రంగ ప్రముఖులంతా తీవ్ర ఆవేదనకు గురవుతోన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి హరికృష్ణ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ హరికృష్ణ గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా ద్వారా మీడియా వాళ్ళకి ఓ అభ్యర్ధన చేసాడు.

Manchu Manoj:stop telecasting Hari Krishna post accident visuals..

” ఆయన మరణం తీవ్ర దిగ్బ్రాంతికి, బాధకి గురిచేస్తోంది. దేవుడు చాలా కఠినాత్ముడు.” అని తన ఆవేదనను వ్యక్తం చేసిన మనోజ్, మీడియా గురించి ప్రస్తావిస్తూ, దయచేసి మీడియా వాళ్ళు హరికృష్ణ గారి ప్రమాద ఘటనా దృశ్యాలను ప్రసారం చేయవద్దని, వాటిని ప్రసారం చేయడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు మరింత కృంగిపోతారని విన్నవించాడు. “ఆ మహానుభావుడికి గౌరవమిస్తూ, తన విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను.” అంటూ ట్వీట్ చేసి మీడియాను అభ్యర్ధించాడు మనోజ్.

- Advertisement -