టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ మద్య వార్తల్లో తెగ హల్‌చల్ చేస్తున్నాడు. తమ విద్యానికేతన్ సంస్థ ఫీజు రియింబర్స్మెట్ బిల్లులు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం లేదని నిన్న తిరుపతిలో మోహన్‌బాబు దీక్ష చేపట్టారు విషయం తెలిసిందే. ఈ దీక్షలో మంచు మనోజ్ కూడా పాల్గొన్నాడు. అయితే దీక్ష గురించి కొందరు టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన మంచు మనోజ్ ట్విట్టర్ సాక్షిగా సమాధానం ఇచ్చాడు. ప్రతీ రూపాయి క్టార్జితం అని.. నిజాలు తెలుసుకుని మాట్లాడలని స్పందించాడు.
ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తన అబిమానులతో ముచ్చటించాడు. రాజకీయానికి సంబంధించిన ప్రశ్నలూ మంచు మనోజ్ పై నెటిజన్లు సంధించారు. పవన్‌కు మద్దతు ఇస్తావా అని అభిమాని అడిగిన ప్రశ్నకు మంచు మనోజ్ స్పందిస్తూ, తప్పకుండా, తన మద్దతు ఎల్లప్పుడూ జనసేన పార్టీకే ఉంటుందని తెలిపాడు.
ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారన్నది నీ ఇష్టం. కానీ, ఐదు లేదా పది సంవత్సరాల తర్వాత తారక్ అన్న(జూనియర్ ఎన్టీఆర్) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే.. అని మరో నెటిజన్ అడిగాడు. తారక్ వస్తే ఇంకా నేను ఎటు వెళ్తాను తమ్ముడూ?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు అని మనోజ్ సమాధానమివ్వడం గమనార్హం.