సినిమాలకు గుడ్‌బై.. మనోజ్ సంచలన నిర్ణయం !

232
manchu manoj shocking decision
manchu manoj shocking decision
- Advertisement -

మోహన్ బాబు తనయుడు, సినీ నటుడు మంచు మనోజ్‌ ఇకపై సినిమాలు చేయబోనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాతో పాటు, ఇప్పటికే అంగీకరించిన మరో సినిమా పూర్తి చేసిన తరువాత ఎలాంటి సినిమాల్లో నటించనని తన ఫేస్ బుక్ ద్వారా మంచు మనోజ్ ప్రకటించాడు. తన సినిమాలను అందరరించిన అభిమానులు ఈ సంధర్బంగా ధన్యవాదాలు చెప్పాడు మనోజ్‌. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం వివరించలేదు మంచు మనోజ్.

 manoj

అయితే మంచు మనోజ్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నాడా? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? అన్న అనుమానాలు ఫిల్మ్ నగర్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అభిమానులు మనోజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్నారు. మంచు మనోజ్ తండ్రి మోహన్‌బాబు నటించిన ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా సినీ రంగప్రవేశం చేశాడు. బాల నటుడిగా ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాతో వెండి తెరఫై తోలిసారి కనిపించిన మనోజ్ ఆ తరవాత చేసిన ‘పుణ్యభూమి నాదేశం’ సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నాడు. 2004 లో ‘దొంగ దొంగది’ చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మనోజ్ మంచి కమర్షియల్ విజయాన్ని చూడటానికి 2010 వరుకు ఆగావలసి వచ్చింది. ‘దొంగ దొంగది’ తో నటనపరంగా మంచి మార్కులు వేయించుకున్న సినిమా ఎవరేజ్ గా నడవటం, ఆ తరవాత వచ్చిన ‘శ్రీ’, ‘రాజు భాయి’ పరాజయం పాలవడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయడం మొదలు పెట్టాడు మనోజ్. ఆ క్రమంలో ప్రయోగాత్మక చిత్రం ‘నేను మీకు తెలుసా’ చేసి ప్రేక్షకులను ఆకర్షించాడు కానీ సినిమా కధబలం సరిగా లేకపోవడంతో బాక్స్ ఆఫీసు దగ్గర సందడి చేయలేక పోయింది.

Manchu-Manoj-Guntorodu-Movie-Stills-1

2009 లో వచ్చిన ‘ప్రయాణం’ కూడా ఓ మంచి ప్రయత్నం కానీ అది కొద్ది మంది ప్రేక్షకులకు మాత్రమే దగ్గరైంది. 2010 మొదట్లో వచ్చిన ‘బిందాస్’ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల మన్ననలు పొంది మనోజ్ కు తోలి హిట్ ను అందించింది. అదే సంవత్సరం వచ్చిన ‘వేదం’ లో వివేక్ చక్రవర్తిగా నటనలో పరిపక్వతను చూపి అబ్బురపరిచాడు. తరవాత తన అక్క లక్ష్మి తోలిసారి నిర్మించిన ‘ జుమ్మంది నాదం’ చిత్రం పర్వలేదనిపించి మనోజ్ కెరీర్ గ్రాఫ్ ను సమతూకంలో నడిపిస్తుంది. కరేంట్ తీగ సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తరువాత పాండవులు పాండవులు తుమ్మెద,పోటుగాడు,దొంగాట,సుపర్ స్టార్ కిడ్నాప్,ఎటాక్,శౌర్య, గుంటూరోడు లవ్లో పడ్డాడు, నా రాకుమారుడు సినిమాలు చేశాడు. ప్రస్తుం ఒక్కడు మిగిలాడు సినిమా షూటింగ్ దశలో ఉంది.

- Advertisement -