Manchu Manoj:సారీ చెప్పిన మనోజ్

4
- Advertisement -

మోహన్‌ బాబుతో జరిగిన గొడవ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు మంచు మనోజ్. మా నాన్న, అన్న తరఫున మీడియా మిత్రులకు నేను క్షమాపణలు చెబుతున్నాను అన్నారు. జర్నలిస్టు మిత్రులకు నేను అండగా ఉంటాను అన్నారు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అన్నారు.

నేను ఎవరినీ ఎలాంటి ఆస్తులు అడగలేదు…నా భార్య, 7 నెలల కూతురిని ఇందులోకి లాగుతున్నారు అని మండిపడ్డారు మనోజ్. మరోవైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేశారు మోహన్ బాబు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు మోహన్ బాబు.సెక్యూరిటీ కోరినా ఎలాంటి స్పందన లేదని.. వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read:ఈ ఏడాది నెటిజన్లు వెతికిన అంశాలివే!

- Advertisement -