హైడ్రామా..మోహన్ బాబుకు ఇంటిముందు మనోజ్!

11
- Advertisement -

మరోసారి మంచు ఫ్యామిలీలో వివాదం తారస్థాయిలోకి చేరింది. మోహన్‌బాబు ఇంటివద్ద మనోజ్‌ బైఠాయించారు. ఇది ఆస్తి గొడవ కాదు.. నేనంటే విష్ణుకి కుళ్లు.. ఇంట్లోకి వెళ్లనివ్వండి అని డిమాండ్ చేశారు.

ఉద‌యం జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్‌బాబు నివాసానికి మ‌నోజ్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా గేటు తెర‌వ‌క‌పోవ‌డంతో ఆయ‌న అక్కడే బైఠాయించి నిర‌స‌న తెలియ‌జేశారు. ఏప్రిల్ 2న పాప పుట్టిన రోజును కుటుంబంతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చాము. అయితే.. ప‌రిస్థితులు బాగోలేక‌పోవ‌డంతో జైపూర్‌కు వెళ్లాము అన్నారు.

నాకు ఈ ఆస్తి వ‌ద్ద‌ని నాన్న‌కు ఎప్పుడో చెప్పాను. ఇది ఆస్తి గొడ‌వ కాదు. విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే ఇదంతా. అక్క‌డే ఈ గొడ‌వ మొద‌లైంది. డిసెంబ‌ర్ నుంచి గొడ‌వ‌లు జ‌రుగుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఛార్జ్ షీట్ ఫైల్ చేయ‌లేదు అన్నారు.

Also Read:KTR:హనుమాన్ స్వాములతో కేటీఆర్ భోజనం..

- Advertisement -