ఈ వివాదానికి కారణం వినయ్‌: మనోజ్

10
- Advertisement -

వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు తలెత్తాయని సినీనటుడు మంచు మనోజ్‌ అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కూర్చొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని తెలిపారు. తాను ఆస్తి అడిగే వ్యక్తిని కాదని.. ఆ విషయం మీకూ తెలుసని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అప్పట్లో విద్యాసంస్థలను మా నాన్న హైదరాబాద్‌లో పెట్టొచ్చు. కానీ.. పేద ప్రజలు ఎక్కువగా ఉండే చంద్రగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలని అక్కడ నెలకొల్పారు. కానీ ఆ ప్రాంత ప్రజలను మా నాన్న వరకు రీచ్‌ కానివ్వడం లేదు. అది ఆయనకు తెలియపరచాలని ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నారు. తిరుపతిలో వినయ్‌ వ్యవహార శైలి నాకు నచ్చడం లేదు. వాటికి సమాధానం చెప్పాలి. ప్రస్తుతం మా అమ్మ ఆస్పత్రిలో లేరు.. ఇంట్లోనే ఉన్నారు. ఈ వివాదానికి కారణం మా నాన్న కాదు అని మనోజ్‌ అన్నారు.

Also Read:మోహన్ బాబుపై కేసు నమోదు

- Advertisement -