రెండో పెళ్లి వార్తలపై మంచు మనోజ్‌ క్లారిటీ..

358
- Advertisement -

టాలీవుడ్ యువ హీరో మంచు మనోజ్‌కు పెళ్లై విడాకులైన విషయం తెలిసిందే. మనోజ్‌ 2015లో ప్రణతి రెడ్డిని పెళ్లాడారు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ప్రణతి రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండగా, మనోజ్ సినీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇదిలావుండగా మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఇటీవల వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు అమ్మాయి మోహన్ బాబు బంధువుల కుటుంబానికి చెందినదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరో మంచు మనోజ్ స్పందించారు. పెళ్లి తేదీ, ముహూర్త ఘడియలు కూడా మీరే చెప్పేయండి అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తద్వారా తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజంలేదని చెప్పకనే చెప్పారు. మనోజ్ మరోసారి పెళ్లి చేసుకుంటున్నాడా…? అంటూ ఓ మీడియా సంస్థ కథనంతో పాటు బ్రహ్మానందం ఫొటోలతో ఉన్న మీమ్ ను కూడా పంచుకుంది. దీనిపైనే మనోజ్ ఈ విధంగా స్పందించారు.

- Advertisement -