విడాకులు తీసున్న మంచు హీరో..!

328
manoj

హీరో మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దానికి చాలా కారణాలున్నాయని మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యలో తాజాగా ఈ మంచు హీరో పూర్తి క్లారిటీ ఇచ్చాడు. మనోజ్‌ తన భార్య ప్రణతీ రెడ్డితో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంపై హీరో మనోజ్ ఓ లేఖను సోషల్‌ మీడియాలో విడుదల చేశాడు.

manchu-manoj

”నా వ్యక్తిగత జీవితం, కెరీర్‌ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేను విడాకులు తీసుకున్న విషయాన్ని బాధతో మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక అందమైన, గొప్ప అనుబంధానికి ముగింపు పలికాం. మా ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డాం. దీనిపై సుదీర్ఘమైన ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నాం. మున్ముందు కూడా మేమిద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకోవాలనుకుంటున్నాం. ఈ నిర్ణయాన్ని మీరంతా సమర్ధిస్తారని, మా ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు” అని మనోజ్‌ లేఖలో పేర్కొన్నాడు.