Manchu Manoj:షాకింగ్ : మనోజ్ పై విష్ణు దాడి

38
- Advertisement -

మంచు మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణ. అలాంటి ఆయన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పైగా గొడవ పడింది సొంత అన్నదమ్ములు. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇంటికి వెళ్లి గొడవ పడిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి విష్ణుకి మనోజ్ కి మధ్య సరైన రిలేషన్ లేదు అంటూ తాజాగా వారి సన్నిహితులు చెబుతున్నారు. మనోజ్ కి ఆస్తుల పంపకాల్లో కూడా అన్యాయం జరిగిందని కొత్తగా పుకార్లు వినిపిస్తున్నాయి.

అసలేం జరిగింది అంటే.. మంచు విష్ణు, మనోజ్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. ఆ సమయంలో మనోజ్ ఆ గొడవ తాలూకు విజువల్స్ ను షూట్ చేశాడు. పైగా ఈ వీడియోను తీస్తూ.. విష్ణు తరుచూ ఇలా ఇంటికి వచ్చి తన బంధువులను కొడుతున్నాడు అంటూ మంచు మనోజ్ చేసిన కామెంట్స్ మంచు ఫ్యామిలీ అభిమానులను షాక్ కి గురి చేశాయి. ఈ వీడియోతో మంచు విష్ణు – మంచు మనోజ్ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నట్లు అర్థం అయ్యింది.

మంచు ఫ్యామిలీలో అసలు ఎందుకు విభేదాలు ?

ఆస్తుల పంపకాల్లో మంచు మనోజ్ కి అన్యాయం జరిగిందని తెలుస్తోంది. అలాగే, మోహన్ బాబు వ్యాపారాలు అన్నీ విష్ణునే చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంచు మనోజ్ కొత్త సినిమా నిర్మాణానికి మోహన్ బాబు నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. మంచు విష్ణునే మనోజ్ కి ఆర్థిక సహాయం అందకుండా అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల పంపకాల విషయంలో మొదలైన మనస్పర్థలు.. ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్లి దాడులు చేసుకునే వరకూ వెళ్ళడం నిజంగా మోహన్ బాబుకు అవమానకరమే. ఇంతకీ ఈ గొడవ పై మోహన్ బాబు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -