టాలీవుడ్ యువ నటుడు మంచు మనోజ్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మనోజ్ తన భార్య ప్రణతిరెడ్డితో కొంతకాలం క్రితం విడిపోయారు. మంచు మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకుంటారని ఊహాగానాలు ఉన్నాయి. తాజాగా ఈ విషయం గురించి మొదటిసారి స్పందించాడు మంచు హీరో. “కొంత కాలంగా, నేను ఈ స్పెషల్ న్యూస్ ను నా హృదయానికి దగ్గరగా ఉంచుతున్నాను. నా జీవితంలోని తదుపరి దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను. 2023 జనవరి 20న ప్రకటిస్తున్నాను. ఎప్పటిలాగే మీ అందరి ఆశీర్వాదం కావాలి ” అని మనోజ్ ఓ GIFతో పాటు పోస్ట్ చేశాడు.
రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనిక రెడ్డితో మంచు మనోజ్ కొన్ని నెలలుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా వీరిద్దరూ కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. మంచు మనోజ్ , మౌనిక రెడ్డి వచ్చే నెలలో వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఆ విషయన్ని మ్యారేజ్ డేట్ వివరాలతో మనోజ్ జనవరి 20 న ప్రకటించనున్నాడు.
అలాగే కెరీర్ పై కూడా ఫోకస్ పెడుతున్నాడు మనోజ్. ఈ ఏడాది ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకొని షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ తో గతంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టిన మనోజ్ ఆ సినిమాను క్యాన్సెల్ చేసుకున్నాడాని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి..