వారిని తట్టుకోలేక మారిపోయిన మంచు లక్ష్మి !

117
manchu laxmi
- Advertisement -

ఒకప్పుడు మంచు వారి ఆడపడుచు ‘మంచు లక్ష్మి’ నిత్యం ట్రోలింగ్ కి గురయ్యేది. ముఖ్యంగా మంచు లక్ష్మి బాషపై, ఆమె చేసే ట్వీట్లతో పాటు ఆమె వేసుకున్న దుస్తులను కూడా ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు ట్రోలర్స్. మొదట్లో మంచు లక్ష్మి ట్రోలర్స్ తో ఫైట్ చేసింది. కొన్నిసార్లు బాధతో, మరికొన్ని సార్లు బెదిరిస్తూ పోస్టులు పెట్టింది. రీసెంట్ గా మంచు ఫ్యామిలీ వార్నింగ్ ఇచ్చినా ట్రోలర్స్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. మంచు ఫ్యామిలీ పై భయంకరమైన మీమ్స్ చేస్తూనే ఉన్నారు. అయితే, ఈ మధ్య మంచు లక్ష్మిని కాకుండా మంచు విష్ణునే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు.

దీనికి ముఖ్య కారణం.. మంచు లక్ష్మి ఈ మధ్య ట్రోలర్స్ కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వడం లేదు. పైగా ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోరపాటు ట్వీట్లు, బోల్డ్ ఫోటోలు పెట్టడం తగ్గించింది. ఆమె తన షోకి సంబంధించిన, అలాగే తన సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ మాత్రమే షేర్ చేస్తోంది. పైగా వాటికి కూడా చాలా గ్యాప్ ఇచ్చింది. ఎప్పుడో అక్టోబర్ 9న మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. మళ్లీ ఎటువంటి పోస్ట్ లేదు. పైగా ఏ స్టేజ్ మీద కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేయలేదు.

మరి మారిన పరిస్థితుల కారణంగా మంచు లక్ష్మి తన పద్దతిని పూర్తిగా మార్చేసింది అనిపిస్తోంది. ట్రోలర్స్ తో తట్టుకోలేక మంచు లక్ష్మి మారిపోయింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సరే.. ఏదైనా కావొచ్చు.. మంచు లక్ష్మి ఇప్పటికైనా నటన పైనే, నిర్మాణం పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎంత లేదన్నా ఆమెలో మంచి నటి ఉంది. అంతకు మించి మంచి నిర్మాత ఉంది. కాబట్టి, మంచు లక్ష్మి తన నైపుణ్యానికి తగ్గట్టు తన నుంచి భవిష్యత్తులోనైనా మంచి వైవిధ్యమైన కంటెంట్ ను అందిస్తోందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -