- Advertisement -
హీరోయిన్ మంచు లక్ష్మీ తన మంచిమనసు చాటుకున్నారు. అమరావతిలో పది ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుంది నటి మంచు లక్ష్మీ. ఈ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, కంప్యూటర్లు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేయనున్నారు లక్ష్మీ.
టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు మంచు లక్ష్మీ. గతంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఆమె ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను చేపట్టారు.
ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు లక్ష్మీ.
Also Read:AP:డీఎస్పీ నియామక పత్రాల పంపిణీ వాయిదా
- Advertisement -

