కేటీఆర్‌ పిలుపుకు సినీతారల మద్దతు…..

218
- Advertisement -

రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కె.తారకరామారావు చేనేత ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరించాలని ఇచ్చిన పిలుపు మేరకు భారీ స్పందన కనిపిస్తోంది. మంత్రి కార్యాలయ అధికారులు, సిబ్బందితో పాటూ టాలీవుడ్ ప్రముఖులు చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.

Manchu Lakshmi Handloom
నటి మంచు లక్ష్మి సంక్రాతి పండుగ పర్వదినాన్ని చేనేత దుస్తులను ధరించి జరుపుకున్నారు. ఈ సందర్భంగా చేనేత ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీఆర్ను అభినందించారు. సంప్రదాయక దుస్తుల్లో తండ్రి మోహన్ బాబు, పాపతో కలిసి దిగిన ఫోటోను మంచు లక్ష్మి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

చేనేత పరిశ్రమకు తాము కూడా అండగా ఉంటామంటూ ఇటీవలే నటుడు నాగార్జున కూడా భార్య అమలతో కలిసి చేనేత దుస్తులు ధరించిన ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. చేనేత దుస్తులు అందంగా ఉండటమే కాకుండా ఎంతో సౌకర్యంగా ఉన్నాయని కింగ్ పేర్కొన్నారు.

Manchu Lakshmi Tweets on Handloom Clothes

చేనేత వస్త్రాలు ధరించి చేనేతకు చేయుతనివ్వల్సిందిగా మంత్రి చేసిన ప్రకటనకు రోజురోజుకు భారీ స్పందన పెరుగుతుంది. చేనేత దస్తులపై అవగాహాన పెరగడమే కాకండా నటీనటులు ఈ దుస్తులు ధరించడంతో చేనేతకు మద్దతు పెరుగుతుంది. కష్టాల్లో ఉన్న చేనేతను అందుకునేందుకు కేటీఆర్‌ చేసిన ప్రకటన అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పలువురు చేనేత కార్మికులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోజుకు నాలుగైదు లక్షల రూపాయలు మించని చేనేత వస్త్రాలు విక్రయాలు.. ఇప్పుడు రూ.12లక్షలకు పెరిగాయి.

- Advertisement -