తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరు యువ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అంతే కాదు టాలీవుడ్‌లో చాలా మంది స్నేహితులను ఏర్పరచుకోవడంతో పాటు హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కుని సెటిలైంది. ఇక రకుల్ బెస్ట్ ఫ్రెండ్స్‌లో మంచు లక్ష్మి ఒకరు. అయితే తాజా రకుల్ తన ఇన్‌స్టాలో మంచు లక్ష్మితో కలిసి దిగిన ఫొటో ఒకటి షేర్ చేసింది. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
రకుల్ ప్రీత్ ఫోటో షేర్ చేసిన నేపథ్యంలో లక్ష్మి సరదాగా కామెంట్ పెట్టింది. “నువ్వు ఇక్కడ ఉండేందుకే వచ్చావు బేబీ. తెలుగు, తమిళ్, హిందీ, జంబలకిడిపంబ ఏ భాషైనా.. నువ్వు అద్భుతమైన ఆర్టిస్టువి” అని కామెంట్ చేసింది. దీనిపై రకుల్ కూడా స్పందించింది. మంచు లక్ష్మి మాటల్లోని తీయదనంతో తనకు షుగర్ వ్యాధి వచ్చేలా వుందని, ఐ లవ్ యూ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.