మరింత ముదరిన మంచు ఫ్యామిలీ వివాదం!

3
- Advertisement -

మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది. మోహన్ బాబు ఇంటికి వెళ్లిన మనోజ్ దంపతులను అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. గేట్లు తీయాలంటూ సెక్యూరిటీ సిబ్బందిపై మనోజ్ మండిపడ్డారు. తమ కుమార్తె లోపల ఉందని లోనికి వెళ్లాలని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తర్వాత లోపలి నుండి మంచు మనోజ్ చిరిగిన చొక్కాతో బయటకు రావడం కనిపించింది. ఈ సమయంలో లోనికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు ఆగ్రహంతో ఊగిపోయారు.

వారిపై చేయిచేసుకున్నారు. బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్‌ కిందపడిపోయారు. మీడియా ప్రతినిధులను బయటకు నెట్టి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు. తమపై మోహన్ బాబు దాడికి నిరసనగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తమకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని వారు ధర్నా చేపట్టారు.

మోహన్ బాబు అస్వస్థతకు గురికాగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనర్​ సీరియస్​గా స్పందించారు. ఇవాళ ఉదయం 10.30కు తమ కార్యాలయానికి రావాలని మోహన్‌బాబు, మనోజ్, విష్ణుకి రాచకొండ సీపీ నోటీసులు జారీచేశారు. మనోజ్‌పై దాడి నేపథ్యంలో అడిషనల్ డీజీపీకి ఫిర్యాదు చేశారు మనోజ్ దంపతులు. దాడిలో మంచు మనోజ్​కు గాయాలయ్యాయని, పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని కోరారు.

Also Read:తాగుడుకు అలవాటుపడ్డావ్:మనోజ్‌పై మోహన్‌బాబు

- Advertisement -