జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం- మంచిర్యాల DCP

428
dcp uday kumar
- Advertisement -

రాజ్యసభ్య సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు మంచిర్యాల డిసిపి కార్యాలయ అవరణలో హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల డిసిపి డి.ఉదయ కుమార్, మొక్కలను నాటారు. మరో మూడు మొక్కలను నాటేందుకు ఎసిపి,సీఐ ,ఎస్ఐ,ప్రజలను ఆహ్వానించారు.

Mancherial DCP Uday Kumar

ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాలోని హోం గార్డ్ అధికారి నుండి ఉన్నత అధికారి వరకు ప్రతి ఒక పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా మూడు మొక్కలు నాటి మూడు సంవత్సరాల పాటు సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకం లేకపోవడం వల్ల కాలుష్యం పెరిగిపోతున్నదని తెలిపారు. పర్యావరాన్ని పరిరక్షించే చర్యలకు స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Mancherial DCP

మొక్కలు నాటి… సంరక్షణ భాద్యతలు సమర్దవంతంగా నిర్వర్తిస్తే అవి వృక్షాలుగా ఎదిగి పర్యావరణపరిరక్షణకు దోహదం చేస్తాయి.తద్వారా వర్షాలు కురుస్తాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే ఉంటుందన్నారు రాజ్యసభ్య సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగించడం అభినందనీయమన్నారు. ప్రజలందరూ,యువత ముందుకు వచ్చి అందరు భాగస్వామ్యులు కావాలన్నారు.

- Advertisement -