- Advertisement -
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల డీసీపీ ఆఖిల్ మహాజన్ మొక్కలు నాటారు. ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి విసిరిన సవాళ్ ను స్వీకరించి తన కార్యాలయంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ఎంపీ సంతోష్‌కుమార్ కు అభినందనలు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామిని చేసినందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఇలానే విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ… మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, జైపూర్ ఏసీపీ నరేందర్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌విసిరారు.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ ఛాలెంజ్…మొక్కలు నాటిన విద్యార్థులు
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్…గర్వపడే సినిమా
మీ అందరికి రుణపడి ఉంటాను!
- Advertisement -