రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించబడిన గ్రీన్ ఇండియాలో అనేక మంది పాల్గొన్ని మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటడమే కాకుండా ప్రజలకు మొక్కల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ మంచిర్యాల బ్రాంచ్ ప్రిన్సిపాల్ కవిత, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కవిత మాట్లాడుతూ.. ఒక మంచి సదుద్దేశంతో ప్రారంభించిన ఈ హరిత ఉద్యమంలో అందరూ భాగస్వామ్యులై మన భూమిని కాపాకుందామన్నారు. పర్యావరణ పరిరక్షణకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సృష్టికర్త అయిన ఎంపీ సంతోష్‌కుమార్‌ని అభినందించారు.
ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశము కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ హారిక, కోఆర్డినేటర్ రవళి ప్రియా, అకాడమిక్ డీన్ ఆంజనేయులు, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంతోష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..