తెలుగు .. తమిళ భాషల్లో వైవిధ్యభరితమైన కథలను .. పాత్రలను ఎంపిక చేసుకుంటూ, సందీప్ కిషన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమీరా దస్తూర్, త్రిధా చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీలో మంజుల, సంజయ్ స్వరూప్‌ల గారాల పట్టి జాన్వి కూడా నటించనున్నది.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రకృతి ప్రేమికురాలు అయిన కథానాయిక అమైరా దస్తర్.. ఆమె స్నేహితుడు సందీప్ కిషన్ తో చేసే సంభాషణగా రూపొందించిన టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఐ యామ్ ఇన్ లవ్ హీరోయిన్ చెప్పడం.. అంతలో హీరో నాకు తెలీకుండా ఎవరితోనే అని ఉత్సుకతతో అడగడంతో టీజర్ ముగుస్తుంది.
మాస్ ఆడియన్స్ మనసు దోచుకున్న సందీప్ కిషన్, ఈ సినిమాతో యూత్ నుంచి ఎన్ని మార్కులు దక్కించుకుంటాడో. దర్శకురాలిగా మంజులకు ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.