14న ‘మనసంతా నువ్వే’రీ-రిలీజ్

3
- Advertisement -

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం ‘మనసంతా నువ్వే’ మళ్లీ థియేటర్లలోకి రాబోతోంది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఒక తరం ప్రేమను ప్రతిబింబించిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై మెరయనుంది.

మధురమైన కథనం, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్న ప్రేమకథే ‘మనసంతా నువ్వే’. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. సంగీత దర్శకుడు రాజేశ్ మన్నే ఈ సందర్భంగా స్పందిస్తూ, “స్వచ్ఛమైన ప్రేమను వెండితెరపై మరోసారి ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం. మధురమైన పాటలు, హత్తుకునే ప్రేమకథను థియేటర్లలో అనుభవించండి” అంటూ ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.

ఉదయ్ కిరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. నేటి తరం యువతకు నిజమైన ప్రేమ కథల్ని పరిచయం చేసే అవకాశం ఈ రీ-రిలీజ్‌తో లభించనుంది. ప్రేమికుల రోజున ‘మనసంతా నువ్వే’ మళ్లీ వెండితెరపై సందడి చేయనుందని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్‌

- Advertisement -