ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ మానస

120
manasa
- Advertisement -

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020గా నిలిచారు తెలంగాణ యువ ఇంజినీర్‌ మానసా వారణాసి(23). ముంబైలో ఫిబ్రవరి 10,2021న జరిగిన ఈ పోటీల్లో మానసా వారణాసి మిస్‌ ఇండియా వరల్డ్‌ 2020 కిరీటాన్ని కైవసం చేసుకోగా హర్యానాకు చెందిన మణికా షియోకాండ్‌ మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2020గా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మన్యసింగ్‌ మిస్‌ ఇండియా 2020 రన్నరప్‌గా నిలిచింది.

మానసా వారణాసి హైదరాబాద్‌లో జన్మించింది. గ్లోబల్‌ ఇండియన్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసింది. అనంతరం నగర పరిధిలోని వాసవి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. మానసా ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్స్‌ఛేంజ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తోంది.

పుస్తకాలు చదవడం, సంగీతం, యోగా, కళలు అనేవి ఆమె ఆసక్తులు. తన తల్లి, అమ్మమ్మ, చెల్లెలు ఈ ముగ్గురు తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులని వెల్లడించారు.

- Advertisement -