మనమే..వెడ్డింగ్ సాంగ్!

4
- Advertisement -

తన చార్ట్‌బస్టర్ ఫామ్‌ను కొనసాగిస్తూ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మరో సూపర్ హిట్ ఆల్బమ్‌ను అందించాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో డైనమిక్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘మనమే’ చిత్రం బ్యూటిఫుల్ ట్రాక్‌లతో అలరిస్తోంది. మొదటి పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో సెకండ్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా మూడో సింగిల్‌ని రిలీజ్ చేశారు.

వెడ్డింగ్ సాంగ్ గా రిలీజ్ చేసిన ఈ సాంగ్‌ని ప్రముఖ సింగర్ రామ్ మిర్యాల పాడారు. హిట్ సంగీత దర్శకుడు హీషం అబ్దుల్ వహాద్ నుంచి మరో డీసెంట్ ట్రాక్ ని అందించాడని చెప్పాలి. ఓ మంచి వెడ్డింగ్ సెలబ్రేషన్ సాంగ్ గా తీశారు. ఆయేషా ఖాన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా జూన్ 7న రిలీజ్ కాబోతుంది.

Also Read:Harish:NHM ఉద్యోగుల జీతాలు చెల్లించండి

- Advertisement -