ఆపదలో అండగా మనం సైతం..

241
Manam Saitham
- Advertisement -

ఆపదలో ఉన్నవారిని, సహాయార్ధం కోసం చూస్తున్న ఆపన్నులను ఆదుకుంటు పెద్ద చారిటిగా ఎదుగుతున్న సంస్థ మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు సాయం అందజేశారు. సేవే లక్ష్యంగా సాగుతున్న మనం సైతం సంస్థ రంజాన్ పర్వదినాన్ని సహాయ కార్యక్రమాలతో ప్రారంభించింది.

Manam Saitham

సంస్థ నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఈ ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా పలువురు పేదలకు ఆర్థిక సహాయం చేశారు. దివ్యాంగులు రమణమూర్తికి ట్రై మోటార్ సైకిల్ అందజేశారు.

ప్రొడక్షన్ మేనేజర్ ప్రకాష్ శస్త్రచికిత్సకు, వేణు పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మనం సైతం సేవా కార్యక్రమాలను అభినందించారు. పేదలకు సహాయం అందించిన రోజే తనకు నిజమైన పండుగ అని కాదంబరి అన్నారు.

- Advertisement -