మనాలీని కప్పేసిన మంచు దుప్పటి

537
manali
- Advertisement -

మండు వేసవిలోనూ మంచు దుప్పటి కప్పుకునే ప్రాంతం మనాలీ. హిమాలయాలపై విహంగ వీక్షణం, పర్వతాల అంచున ప్రయాణం… ఎముకలు కొరికే చలిలో, చన్నీటిలో నదీయానం …ఎన్నో అందమైన అనుభూతుల్ని  మనతో తెచ్చుకోవాలంటే ఒక్కసారి పర్యాటక ప్రసిద్ధి రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ను చుట్టి రావాల్సిందే!

దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుండగా తాజాగా వింటర్ సీజన్‌లో తొలిసారి మనాలీని మంచు వర్షం పలకరించింది. గురువారం ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు నమోదుకాగా నాలుగు సెంటీమీటర్ల మంచు పేరుకుపోయింది. నీలాకాశం, ఎత్తైన కొండలు వాటి మధ్యలో రోడ్లు, ఇళ్లను కప్పేసిన మంచు.. ఇలా మనాలీ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రోడ్లపై ఎక్కడికక్కడ మంచు పేరుకుపోగా మనాలీ అందాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -