ట్రెండింగ్‌లో MSG ట్రైలర్

6
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నయనతార, క్యాథరిన్ త్రెసా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తుండగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

ట్రైలర్ చూస్తుంటే చిరంజీవి వింటేజ్ కామెడీ బాగానే ఉన్నట్టు, భార్య భర్తల కామెడీ సీన్స్, మాస్ యాక్షన్ ఫైట్స్, చిరు – వెంకీ కాంబో అదిరిపోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ లోనే డైలాగ్స్ అదరగొట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజయి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Also Read:నాడైనా-నేడైనా..తెలంగాణకు కాంగ్రెస్‌ విలనే

 

- Advertisement -