MSG:ఐదో రోజు వసూళ్ల వివరాలు!

7
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. చిరంజీవి గత చిత్రం భోళా శంకర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, ఈ సినిమా ద్వారా ఆయన అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కుటుంబ ప్రేక్షకులను మెప్పించే వినోదాత్మక కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రాంతీయ సినీ పరిశ్రమలో కొత్త హిట్‌గా నిలవబోతోంది.

కేవలం ఐదు రోజుల్లోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రపంచవ్యాప్తంగా రూ.226 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది ఇప్పటివరకు ఏ తెలుగు ప్రాంతీయ చిత్రానికి లభించిన అత్యంత వేగవంతమైన కలెక్షన్‌గా రికార్డు సృష్టించింది. చిరంజీవికి ఒక్క మంచి సినిమా చాలు, బాక్సాఫీస్ వద్ద ఆయన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ సినిమాను షైన్ స్క్రీన్స్‌కు చెందిన సాహు గరపాటి‌తో కలిసి సహనిర్మాతగా వ్యవహరించడం. నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేశ్ విస్తృతమైన క్యామియో పాత్రలో మెరిశారు. క్యాథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషించారు.

Also Read:ఈడీ సోదాలు..కోట్ల రూపాయలు స్వాధీనం

- Advertisement -