మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం థియేటర్లలో విడుదలై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక Zee5 సొంతం చేసుకుంది. నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం. అయితే అధికారిక ఓటీటీ విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫిబ్రవరి చివరి నాటికి Zee5లో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రం Z స్టూడియోస్ సమర్పణలో రూపొందినందున, Zee5 డిజిటల్ పార్ట్‌నర్‌గా, Zee సినిమాలు శాటిలైట్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సాహు గరపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకుడు. నయనతార హీరోయిన్‌గా నటించారు.
Also Read:లైంగిక దాడి..కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్!

