జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేయొచ్చని సామెత . అందమైన జుట్టు పొందడానికి ప్రతి ఒక్కరూ కాస్తైన కేర్ తీసుకుంటారు. పొడవాటి నల్లటి ఒత్తైన జుట్టు పొందాలని భావిస్తారు. ఎందుకంటే తల వెంట్రుకలే అందాన్ని ఇస్తాయి. కానీ అదే జుట్టు ఆమె ప్రాణాన్ని కాపాడాయి. ఆమె పెంచుకున్న జుట్టు ఆమె చనిపోవాలని కోరుకున్నా కూడా కాపాడగలిగింది.
వివరాల్లోకి వెళ్తే చైనా షాంగ్జీలోని ఏడు అంతస్తుల భవనంలో కాంగ్, లీయూ అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే, తాజాగా వీరిద్దరు ఏదో కారణంగా గొడవ పడ్డారు. దీంతో కోపం వచ్చిన లీయూ ఆత్మహత్య చేసుకునేందుక సిద్దమైంది. బిల్డింగ్ పై నుంచి దూకేందుకు ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకోచ్చింది.
ఆ సమయంలో కాంగ్ కూడా లీయూ వెంట పరుగెత్తుకొచ్చి ఆమె దూకేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఆమె జుట్టును అందుకున్నాడు. దీంతో లీయూ అలాగే వేలాడుతు ఉండిపోయింది. ఒక్కడు ఆమెని పైకి లాగలేక పోవడంతో వెంటనే సమీపంలోని పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను కాపాడారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.