ట్రాఫిక్‌ పోలీసుల దౌర్జన్యం

226
Man refused to get down from motorbike
- Advertisement -

వారు పోలీసులు.. చట్టాన్ని కాపాడి సామాన్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత వారిది. కానీ తమ పని మరిచారు. కనీసం మనిషిలాగా కూడా ప్రవర్తించకుండా దౌర్జన్యానికి దిగారు. మాటవిననందుకు క్రూరత్వం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళ్తె ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖాన్‌పూర్‌ ట్రాఫిక్‌ పోలీసుల ప్రవర్తించిన తీరు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఓ వ్యక్తి కూర్చుని ఉండగానే అతని ద్విచక్రవాహనాన్ని క్రేన్‌కు వేలాడదీసిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది.

రాజు అనే ఓ వ్యక్తి ఖాన్‌పూర్‌లోని మాల్‌రోడ్డులో తన ద్విచక్రవాహనం నిలిపాడు. అది చూసిన ట్రాఫిక్‌ పోలీసులు అది నో పార్కింగ్‌ జోన్‌ అంటూ అతడి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించబోయారు. అక్కడే జరిమానా చెల్లిస్తాననీ, తన ద్విచక్రవాహనాన్ని తీసుకువెళ్లద్దనీ రాజు బతిమిలాడినా పట్టించుకోకుండా అతను కూర్చుని ఉండగానే క్రేన్‌తో బైక్‌ను గాల్లో వేలాడదీశారు. పోలీసుల వాహనం వేగంగా ప్రయాణిస్తుండటంతో వెనుక ద్విచక్రవాహనంపై కూర్చుని గాల్లో వేలాడుతున్న రాజు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -