అవును మీరు చూస్తోంది నిజమే. సాధారణంగా మొసళ్లను చూస్తే మనుషులు పరుగెడతారు కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా మనిషిని చూసి మొసళ్లు పరుగెడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో స్పష్టంగా మొసళ్లు సేద తీరుతుండగా ఓ వ్యక్తి తన చేతిలో కర్రతో మొసళ్ల వైపు పరుగెత్తుకుంటూ రాగా ఆ వ్యక్తిని చూసి షాక్ అయిన మొసళ్లు వెంటనే నీటిలోకి వెళ్లిపోయాయి. ఇలా ఒక్క మొసలి కాదు పదుల సంఖ్యలో ఉన్న మొసళ్లు నీటిలోకి వెళ్లడం వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు ముక్కున వేళేసుకుంటున్నారు. కొంతమంది దీనిని ఫన్నీగా తీసుకోగా మరికొంతమంది మాత్రం ప్రాణాలకు తెగించి ఇలాంటి చర్యలు అవసరమా అని మండిపడుతున్నారు.
I don’t know why this is so funny but it is. pic.twitter.com/DtJHFJ47gS
— Nature is Amazing
(@AMAZlNGNATURE) March 15, 2025
Also Read:లండన్‌లో చిరుకు గ్రాండ్ వెల్‌కమ్