మానవత్వమా.. నీ చిరునామా ఎక్కడ?

258
dead body
- Advertisement -

మానవత్వం మరోసారి మంటగలిసింది. మొన్న ఒడిశాలో ద‌నమాఝీ నిన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో సునీల్ కుమార్‌ నేడు మ‌ధ్య ప్ర‌దేశ్‌లో భీమ్ రావ్ ఆయా సంఘ‌ట‌న‌ల్లో చ‌నిపోయింది ఎవ‌రైనా, ఆ మృత‌దేహాల‌ను తీసుకువెళ్తుంది మాత్రం భుజం పైనే. తాజాగా అలాంటి సంఘటనే మానవత్వమా నీ చిరునామా ఎక్కడా అంటూ సభ్యసమాజాన్ని ప్రశ్నిస్తోంది. కాటికి మోసేందుకు నలుగురు లేకపోవడంతో తన మరదలి శవాన్ని సైకిల్‌పై స్మశానానికి తరలించారు ఓ వ్యక్తి.ఒడిశాలో జరిగిన ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

బ్రాహ్మణిపల్లి పంచాయతీ కృష్ణపల్లి గ్రామానికి చెందిన పంచు మహకుద్‌ అనే యువతి అతిసార వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొచ్చి ఆమె బావ ఇంటి వద్ద దింపి వెళ్లిపోయారు. అయితే ఇటీవలె వారి కుటుంబంలో వివాహం జరగింది. విందు భోజనం పెట్టకపోవడంతో ఆ కుటుంబాన్ని వెలివేశారు ఆ గ్రామ పెద్దలు.

దీంతో మృతదేహాన్ని శ్మశానానికి తరలించడానికి ఎవరూ రాలేదు. గత్యంతరం లేకపోవడంతో పంచు మహకుద్‌ బావ మృతదేహాన్ని సైకిల్‌కు కట్టుకుని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించాడు. గ్రామస్తుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -