మనిషే..కుక్కను కరిచాడు…!

317
Man Bites Dog
- Advertisement -

కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే సామేత ఈ యువకుడికి సరిగ్గా సరిపోతుందేమో. కోపంతో కుక్కను కరిచి వార్తల్లో నిలిచాడు ఓ ప్రబుద్దుడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ విచిత్రం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. నార్త్ షీల్డ్‌కు చెందిన టేలర్‌ అనే యువకుడు తన పెంపుడు కుక్కను దారుణంగా కరిచి గాయపరిచాడు. 8 నెలల వయసున్న ఆ కుక్క టేలర్‌కు నచ్చడం లేదట.

దీంతో చికాకుతో కుక్క మొహన్ని దారుణంగా కొరికేశాడు. కుక్క డీజిల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. టేలర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు 750 డాలర్ల జరిమానా విధించి…10 ఏళ్ల పాటు జంతువుల్ని పెంచుకోకుండా నిషేధం విధించారు.

అయితే జడ్జి ముందు టేలర్‌ వినిపించిన వాదన అందరికి నవ్వు తెప్పించిందట. కుక్కను ఎందుకు కరిచావని జడ్జి అడిగితే అది మంచిది కాదని అందుకే కరిచానని తెలిపాడట. మొత్తంగా కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు మనిషే కుక్కను కరిస్తే వార్త అంటూ మరోసారి నిరూపించాడు టేలర్.

- Advertisement -