- Advertisement -
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందీగ్రామ్ నుండి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు తృణముల్ చీఫ్,సీఎం మమతా బెనర్జీ. నందీగ్రామ్ నుంచి పోటీ చేస్తానని, అది నాకు కలిసివచ్చే స్థానం అని ప్రకటించారు. కోల్‌కతాలోని బాబనిపుర్‌తో పాటు నందీగ్రామ్ నియోకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సువేందు బీజేపీలో చేరారు. దీంతో నందీగ్రామ్ నుండే పోటీ చేసేందుకు దీదీ సిద్ధమైంది.
గతంలో నందీగ్రామ్‌లో రైతు ఉద్యమం చేపట్టి అధికారాన్ని సొంతం చేసుకున్నారు మమతా. లెఫ్ట్ కోటను నందీగ్రామ్ నుండే బద్దలు కొట్టడంతో గతంలో కలిసి వచ్చిన నందీగ్రామ్ నుంచి తాను పోటీ చేయనున్నట్లు మమతా ప్రకటించారు.
- Advertisement -