మోదీ గడ్డంపై దీదీ షాకింగ్ కామెంట్స్‌..

188
mamatha
- Advertisement -

పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న మమత ఓ బహిరంగ సభలో శుక్రవారం మాట్లాడారు.

మమతా సభలో మాట్లాడుతూ.. మోదీ హయాంలో దేశంలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. దేశంలో ఏ పురోగతి లేదని కేవలం ఆయన గడ్డం మాత్రమే పెరుగుతున్నదని మమతాబెనర్జీ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి చలోక్తులు విసిరారు. ప్రధాని మోదీ కొన్నిసార్లు తనను తాను స్వామి వివేకానందగా చెప్పుకుంటారని ఆమె సెటైర్లు కురిపించారు.

ఇటీవల ప్రధాని మోదీ క్రికెట్ స్టేడియానికి తన పేరు పెట్టుకున్నారని మోదీ తీరు చూస్తుంటే ఆయన మెదడులో ఏదో తేడాలు ఉన్నట్లు అనిపిస్తున్నదని మమత అనుమానం వ్యక్తంచేశారు. మోదీ వాలకం చూస్తుంటే ఆయన స్క్రూ లూజ్ అయిందేమో అనిపిస్తున్నదని మమతా బెనర్జి వ్యాఖ్యానించారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ రాక్షసుడని మమత ఆరోపించారు.అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

- Advertisement -