నన్ను కూడా అరెస్ట్ చేయాలి- మమతా బెనర్జీ

157
Mamata Banerjee
- Advertisement -

పశ్చిమబెంగాల్‌లో ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌లో సీబీఐ అధికారులు సోమవారం తెల్లవారుజామున ఇద్దరు మంత్రులను అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది. మంత్రుల అరెస్ట్ చేయడంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భగ్గుమన్నారు. ‘‘ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేశారు. ఎలాంటి పద్ధతినీ అవలంబించలేదు. సీబీఐ నన్ను కూడా రెస్ట్ చేయాలి’’ అంటూ మమత డిమాండ్ చేశారు. మరోవైపు ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు మరికొందరు తృణమూల్ కార్యకర్తలు సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి ఫిర్హద్ హకీంతో పాటు సుబ్రతా ముఖర్జీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నార‌ద కుంభ‌కోణం కేసులో ప‌శ్చిమ బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హ‌కీంతో పాటు మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మదన్ మిత్ర, సోవన్ ఛటర్జీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫిర్హాద్ హ‌కీం… మ‌మ‌తా బెన‌ర్జీ కేబినెట్‌లో ర‌వాణాశాఖ‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఉదంతంలో అప్పటి తృణమూల్ కాంగ్రెస్ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు.

- Advertisement -