నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామ మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి పై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. “#మామా మశ్చీంద్ర ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ట్రైలర్ బ్లాస్ట్ గా ఉంది! సుధీర్ బాబు, టీమ్‌కి ఆల్ ది బెస్ట్” తెలియజేశారు మహేష్ బాబు.
పరశురామ్ పాత్ర (సుధీర్ బాబు)ని పరిచయం చేసే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. పరశురాంకి మిర్నాళిని రవి, ఈషా రెబ్బా ఇద్దరు కుమార్తెలు. వారు పరశురామ్ సోదరి కొడుకులైన కవలలు డిజే, దుర్గాలతో ప్రేమలో పడతారు. తనపై పగ తీర్చుకునేందుకు డీజే, దుర్గా తన కూతుళ్లతో లవ్ గేమ్ ఆడుతున్నారని పరశురాం అనుమానపడతాడు. ట్రైలర్ సూచించినట్లుగా హర్షవర్ధన్ ఒక యునిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో ముందుకు వచ్చారు. మూడు పాత్రలను విలక్షణంగా చూపించాడు. పరశురామ్ క్రూరమైన నేరస్థుడు. డిజే ప్లేబాయ్. దుర్గ ఒక లావుపాటి వ్యక్తి. ఈ మూడు పాత్రల్లో సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. మిర్నాళిని రవి, ఈషా రెబ్బా గ్లామర్‌గా కనిపించారు. హర్షవర్ధన్ కూడా కీలక పాత్ర పోషించారు. పీజీ విందా సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్ అసెట్. ఈ చిత్రానికి రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌కి చెందిన సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. మామా మశ్చీంద్ర అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ముందుగా నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి పాదభివందనాలు.’మామా మశ్చీంద్ర’ అక్టోబర్ 6న విడుదలౌతుంది. నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ గారి ధన్యవాదాలు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా నిర్మాతలకు మంచి రిటర్న్స్ ఇస్తుందనే నమ్మకం వుంది. హర్ష రైటింగ్ కి నేను అభిమానిని. తనకిక్రాఫ్ట్ మీద చాలా పట్టుంది. తప్పకుండా తను టాప్ డైరెక్టర్ అవుతారు. మనం చూసినప్పుడు అరుదైన సినిమాగా ఎలా ఫీలయ్యారో ఈ సినిమా చుసిన్నపుడు కూడా ఆలాంటి అరుదైన అనుభూతి కలుగుతుంది. పీజీ విందా, మార్తండ్ కే వెంకటేష్ గారు, చేతన్ భరద్వాజ్ .అందరూ బ్రిలియంట్ గా వర్క్ చేశారని తెలిపారు.
Also Read:‘టైగర్ సందేశం’.. సెన్సేషన్