మామా మశ్చీంద్ర…ఫస్ట్ లుక్

73
sudheer babu
- Advertisement -

సుధీర్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఈరోజు “మామా మశ్చీంద్ర” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంలో మేకర్స్ మాట్లాడుతూ, సుధీర్ బాబు టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్ మరియు డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తూ తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్ ని సైతం ఆకట్టుకుంటున్నాడని తెలిపారు. వారు సుధీర్ బాబు కి ‘నైట్రో స్టార్’ ట్యాగ్ ఇచ్చారు.

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా హర్షవర్ధన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ ఎల్‌ పి ప్రొడక్షన్ నెం 5గా నారాయణదాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం “మామా మశ్చీంద్ర” ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ”మామా మశ్చీంద్ర’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టడానికి గల కారణం,ఈ టైటిల్ సినిమాలో నైట్రో స్టార్ సుధీర్ బాబు పాత్రని ప్రతిబింబిస్తుందన్నారు. మశ్చీంద్ర అనే పదానికి అర్ధం పవర్ ని కోరుకునేవాడు, ధైర్యవంతుడని వివరించారు.ఈ సినిమాలో సుధీర్ బాబు ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నైట్రో స్టార్ సుధీర్ బాబు ఒక రాక్ స్టార్ లా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.

దర్శకుడు హర్షవర్ధన్ మునుపెన్నడూ చూడని మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో సుధీర్ బాబుని ఈ చిత్రంలో చూపించబోతున్నారని తెలిపారు . సోనాలి నారంగ్, సృష్టి సెల్యులాయిడ్ సమర్పిస్తున్న ఈ చిత్రం వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోందన్నారు ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపిస్తుండగా, అత్యున్నత టెక్నికల్ టీం పని చేస్తోందన్నారు.

ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, పిజి విందా సినిమాటోగ్రాఫర్ గా, రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ వారు త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు.

- Advertisement -