ఎన్నికలలో ఫార్మా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం..ఫార్మా రద్దు చేసి అక్కడ మంచి టౌన్ షిప్ ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఫార్మా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కట్టుబడి పని చేస్తున్నారన్నారు.
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పని చేస్తుంది…2017 అక్టోబరు లో కేంద్రం, రాష్ట్రం కలిసి ముచ్చర్ల ఫార్మా సిటీ పేరుతో 20 వేల ఎకరాల భూమి సేకరణ కోసం పని చేసిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో అప్పటి BRS ప్రభుత్వం 19 వేల 330 ఎకరాల భూమి కావాలని అడిగినప్పుడు ప్రజలు వ్యతిరేకం చెప్పారు..ప్రభుత్వం వేల మంది పోలీసులు పెట్టి ప్రజలను అడ్డుకున్నారన్నారు. ఫార్మాసిటీ పేరుతో BRS ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే బ్రోకర్ దందా చేసి ప్రజలను దోచుకున్నాడు..తిన్నది అంతా కక్కిస్తాం అన్నారు..
ఫార్మా రైతులు..పట్నం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజక వర్గాల ప్రజలు చాలా సంతోషం గా ఉన్నారని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన ఉందని…ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణంగా అండగా ఉన్నారన్నారు.
Also Read:మళ్ళీ చీలిక.. ఎన్సీపీ వైపే?