Congress:మల్లు రవి Vs సంపత్ కుమార్

9
- Advertisement -

నాగర్‌కర్నూల్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మరియు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

మా దగ్గర ఎక్స్ అఫిషియో ఓటు అవసరం ఉన్నప్పుడు మల్లు రవి రాలేదు. అవసరం లేని చోట, ఇద్దరు కౌన్సిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో వెళ్లి ఓటు వేశాడు. ఇదంతా నా తలరాత… వచ్చే ఎన్నికల్లో చూసుకుంటా అంటూ సంపత్ కుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

గతంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సీటు కోసం కూడా ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. సంపత్ కుమార్ టిక్కెట్ ఆశిస్తుండగా, మాజీ ఎంపీ మల్లు రవి “టిక్కెట్ నాదే” అంటూ ప్రచారం ప్రారంభించారు. వాల్ పోస్టర్లు, భారీ ఫ్లెక్సీలతో ఇరువర్గాలు బలప్రదర్శన చేయడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ బలపడ్డ సమయంలోనే ఈ విభేదాలు బయటపడటం గమనార్హం. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ అంతర్గత విభేదాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Also Read:‘పెద్ది’..సెకండ్ సింగిల్ అప్‌డేట్!

- Advertisement -