టీఆర్ఎస్‌కు ఖర్గే మద్దతు..ప్రధాని తీరుపై మండిపాటు

285
kharge
- Advertisement -

తెలంగాణ పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు ప్రధానిపై టీఆర్ఎస్ సభా హక్కుల నోటీసు ఇవ్వడంతో పాటు రాజ్యసభనే స్తంభింపజేశారు టీఆర్ఎస్ నేతలు. అనంతరం రాజ్యసభను బహిష్కరించగా కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా టిఆర్ఎస్ వాదనతో ఏకీభవించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టిఆర్ఎస్ కు మద్దతు పలికారు.

ప్రధానమంత్రి తీరుపై మండిపడ్డారు ఖర్గే. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎనిమిదేళ్ల తర్వాత కూడా ప్రధాని మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించకుండా, మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలపైనే ఆధారపడాల్సి రావడం సిగ్గుచేటు అన్నారు.

- Advertisement -