బాలీవుడ్ హాట్ బాంబ్ మల్లికాశరావత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. గురువారం ‘దాస్ దేవ్’ చిత్రం ముంబైలోని అందేరి మల్టీ ప్లెక్స్‌లో స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకుంది. ఈ షోకి హాజరైనా మల్లిక కొద్ది రోజులుగా దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు, కాస్టింగ్ కౌచ్‌పై రియాక్ట్ అయింది.
‘మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తి పుట్టిన నా భారతదేశం.. అత్యాచారాలకు అడ్డాగా మారింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది మల్లికశరావత్. ఇలాంటి దారుణ ఘటనలు మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చాయని, మీడియా లేకుంటే పరిస్థితి ఇంకెలా ఉండేదోనని వ్యాఖ్యానించింది. మీడియా కారణంగానే ప్రజల్లో చైతన్యం పెరుగుతోందన్నారు. దేశంలో అత్యాచారాల నివారణకు కొత్త చట్టం వచ్చిందంటే అది మీడియా గొప్పదనమేనని పేర్కొంది.
ఇప్పటికే బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు జమ్ముకశ్మీర్‌లోని కథువా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచార ఘటనలని ఖండిస్తూ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..దాస్ దేవ్ చిత్రం సుధీర్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో అదితి రావు హైదరి, రీచా చద్ధా, రాహుల్ భట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.