నమస్తే మంత్రిగారు..వివేక్‌తో మల్లారెడ్డి

28
- Advertisement -

అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వివేక్ వెంకటస్వామిని నమస్తే మంత్రి గారు అని పలకరించారు మల్లారెడ్డి. థాంక్స్ మల్లన్న అంటూ మురిసిపోయారు వివేక్ వెంకటస్వామి.

రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తుందని మల్లారెడ్డి అనగా బీఆర్ఎస్ హయంలో నీ హవా నడిచిందన్నారు వివేక్ వెంకటస్వామి.

పార్లమెంటులో ఆనాడు వాజపేయి లాంటివారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారు అని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మల్లారెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు హత్తుకుపోయేవారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీలో ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేది అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తోందన్నారు.

Also Read:ఎమ్మెల్యేల ఫిరాయింపు..ఏప్రిల్ 2కు వాయిదా

- Advertisement -