పార్టీ మారే ప్రసక్తే లేదు:మల్లారెడ్డి

21
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. బెంగళూరులో డిప్యూటీ సీఎం శివకుమార్‌తో భేటీ అయ్యారు మల్లారెడ్డి. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కొడుకు భద్రారెడ్డితో కలిసి భేటీ కావడంతో కాంగ్రెస్‌లో చేరుతాయని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన మల్లారెడ్డి..తాను పార్టీ మారనని తెలిపారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. బెంగళూరులో డీకే శివకుమార్‌ను ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలివానని,ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు.

శివకుమార్‌ తనకు మిత్రుడని, ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ ఎందుకు మారుతానని చెప్పారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలివే..

- Advertisement -