మల్లన్న సాగర్ కాదు జల హృదయ సాగర్‌: సీఎం కేసీఆర్

38
cm
- Advertisement -

ఇది మల్లన్న సాగర్ కాదు జల హృదయ సాగర్ అన్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ జలాశయాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం జాతికి అంకితం చేశారు. ఈ సంద‌ర్భంగా కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన సీఎం కేసీఆర్… మల్లన్న సాగర్‌ కోసం నిర్వాసితులు చేసిన త్యాగం వెలకట్టలేనిదన్నారు.

కొందరు నేతలు ఇక్కడికొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు…కానీ వాటన్నింటిని ఎదురించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. కాళేశ్వరంతో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైందన్నారు. మత్స్య,పాడి పరిశ్రమ అభివృద్ది చెందుతుందన్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందన్నారు.

మల్లన్న సాగర్‌ ద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు పూర్తిస్ధాయి న్యాయం చేస్తామన్నారు.ప్రాజెక్టులపై కనీస పరిజ్ఞానం లేని పార్టీలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లి చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని…మంచినీటి సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకే ఈ ప్రాజెక్టు అన్నారు. ఈ దేశం కూడా దారి తప్పిపోతుందని..ఈ దేశం చెడిపోకుండా ముందుకుపోవాలన్నారు. మన రైతులు ధనికులు అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. సమైక్య పాలనలో కరెంట్ కోతతో అల్లాడమని కానీ నేడు ఉచిత కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చామన్నారు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలని..కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రభుత్వం ఉండకూడదన్నారు. మత విద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయం చేయడం సరికాదన్నారు.

- Advertisement -