ఇది ఏపీనా లేక బిహారా..?:మల్లాది విష్ణు

0
- Advertisement -

ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ లు, రౌడీయిజం, అరాచకాలు ఇదీ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అని దుయ్యబట్టారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అన్నారు. ఇది ఏపీనా లేక బిహారా..? చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:ఉపవాసంతో క్యాన్సర్‌కి చెక్!

అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు అన్నారు ఎమ్మెల్సీ సుబ్రమణ్యం. నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరాను. వైద్యుల సూచన మేరకు డిశ్చార్జ్ అయ్యాక తిరుపతికి వస్తాను. నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. నన్నెవరూ బెదిరించలేదు, భయపెట్టలేదు అన్నారు.

- Advertisement -