రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయం రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతం అయింది. ఇటీవలే మే 23 న మొదటి పంపు ట్రయల్ రన్ విజయవంతం కాగా.. ఆదివారం ఉదయం రెండో పంపు ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. త్వరలో సీఎం కేసీఆర్ ఈ జలాశయాన్ని ప్రారంభించనున్నారు.
సిరిసిల్ల జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు గోదావరి నీటిని అందించి ఎండిపోయిన భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం మల్కపేట రిజర్వాయర్ ప్రాజెక్టును చేపట్టింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్యాకేజీ-9 కింద నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ ద్వారా సిరిసల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 96,150 ఎకరాలకు నీందరనుంది.
Also Read:తెలంగాణలో హంగ్.. గ్యారెంటీ ?
130 మీటర్ల లోతు నుండి 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు పంప్ హౌస్‌లో 30 మెగావాట్ల చొప్పున రెండు మోటార్లు అమర్చారు. సర్జ్ పూల్ పంప్ హౌస్ ద్వారా నీటిని రిజర్వాయర్‌లోకి పంప్ చేస్తారు. గ్రావిటీ కాలువల ద్వారా గంభీరావుపేట మండలం సింగసముద్రం ట్యాంకు, బత్తల చెరువుకు గోదావరని నీటిని తరలిస్తారు. అనతరం మరో కాలు ద్వారా ఎగువ మానేరు జలాశయానికి నీటిని తరలిస్తారు.మోటార్లు ఆపరేట్ చేయడానికి 33/11కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయబడింది.
Also Read:స్క్వాట్స్ వ్యాయామం చేయడం మంచిదేనా..?