మొక్కలు నాటిన మల్కాజిగిరి కలెక్టర్..

230
Malkajgiri Collector
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఏడాది పొడుగునా ప్రతి రోజూ మూడు మొక్కలు (1000 పైగా ఒక సంవత్సరంలో) నీనే స్వయంగా నాటి వాటిని సంరక్షిస్తా అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. జూన్ ఐదో తారీకు నుండి ప్రతిరోజు మూడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించానని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ కోసం చేస్తున్న కృషికి ఈ రకంగా భాగస్వాములు అవుతున్నామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ను ఆకుపచ్చ జిల్లాగా రానున్న సంవత్సర కాలంలో మార్చ పోతున్నామని తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి చెట్లను పెంచడం గొప్ప విషయం అని ఇదే విధంగా జిల్లాలో ఉన్న అధికారులు అందరూ కూడా తమ తమ బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.

- Advertisement -