తెలంగాణ ఎన్నికల వేళ మల్కాజ్ గిరి నియోజిక వర్గంలో గెలుపెవరిది అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 2009 నియోజికవర్గ పునః వ్యవస్థికరణలో భాగంగా ఏర్పడిన ఈ నియోజిక వర్గంలో ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు బిఆర్‌ఎస్ విజయం సాధిస్తూ వచ్చాయి. 2014, 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొండుతూ వచ్చారు. 2014 లో .బిఆర్‌ఎస్ తరుపున చింతల కనకా రెడ్డి విజయం సాధించగా, 2018 లో మైనంపల్లి హనుమంతరావు విజయం సాధించారు. ఇక ఈసారి ఎన్నికలకు గాను మొదట మైనంపల్లి హనుమంతరావుకే సీటు కేటాయించింది అధిష్టానం. అయితే నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ మైనంపల్లి బిఆర్‌ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. .
దాంతో అతడి స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలో నిలిపింది బిఆర్‌ఎస్ అధిష్టానం. కాగా కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీ అభ్యర్థిగా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కాగా ప్రస్తుతం ఉన్న సర్వేల రిపోర్ట్ చూస్తే మైనంపల్లికి భారీ ఓటమి తప్పెలా లేదు. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా బిఆర్‌ఎస్ బలం ఎక్కువ. దానికి తోడు నియోజిక వర్గంలో మైనంపల్లి వ్యవహార శైలి కూడా కొంత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. పైగా బిఆర్‌ఎస్ తరుపున మర్రి రాజశేఖర్ రెడ్డి వంటి బలమైన నేత బరిలో ఉండడంతో ఈసారి మైనంపల్లి గెలుపు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి మల్కాజ్ గిరిలో బిఆర్‌ఎస్ ష్యూర్ షాట్ గా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:ఎన్నికలకు టీడీపీ దూరం.. కారణమదే?