రిటైర్మెంట్‌పై మనసు మార్చుకున్న మలింగ..!

592
maligna
- Advertisement -

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న ఆటగాడు లసిత్ మలింగ. సుదీర్ఘకాలం శ్రీలంక జట్టుకు సేవలందించిన మలింగ కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు.ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ తర్వాత మలింగ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తన నిర్ణయంపై మనసు మార్చుకున్నాడు మలింగ. మరి కొన్నేండ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతానని తెలిపాడు. టీ20 మ్యాచ్‌లో ఓ బౌలర్ నాలుగు ఓవర్లే వేస్తాడు. నాకున్న నైపుణ్యంతో ఓ బౌలర్‌గా టీ20ల్లో రాణించగలను. ఒక కెప్టెన్‌గా ప్రపంచవ్యాప్తంగా చాలా టీ20 మ్యాచ్‌లు ఆడాను. మరో రెండేండ్లు ఈ ఫార్మాట్‌లో కొనసాగుతానని భావిస్తున్నట్లు మలింగ పేర్కొన్నాడు.

ఇప్పటి వరకు 219 వన్డేలు ఆడిన మలింగ 335 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌ లో శ్రీలంక తరఫున 7 వన్డేల్లో 13 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక తరపున అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్‌ (523), చమిందా వాస్‌ (399) తర్వాత మూడో బౌలర్‌ మలింగయే.

Sri Lanka captain and veteran pacer Lasith Malinga has had a a rethink on his decision to retire after next year’s Twenty20 World Cup

- Advertisement -