బాబోయ్.. ఆమెనే ఇలా మాట్లాడింది?

58
- Advertisement -

మలైక అరోరా కూడా నీతి సూక్తులు చెప్తోంది. 49 ఏళ్ల వయసులో పైగా పెళ్లి పిల్లలు ఉన్నా.. తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో చాలా ఘాటుగా రొమాన్స్ చేస్తున్న ఈ ముదురు భామ ఇలా నీతులు చెప్పడం ‘మా ఖర్మ’ అంటూ బాలీవుడ్ నెటిజన్లు తెగ ఫీల్ అయిపోతున్నారు. నిజానికి మలైక అరోరా ఇన్ స్టాగ్రామ్ నిండా ఆమె అందాల ఆరబోతే ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లోనే కాదు, కొంతకాలం క్రితం ఆమె ఫుల్లుగా ఎక్స్ పోజింగ్ చేసింది అనేక ఐటమ్ సాంగ్స్ ల్లో.

అలాంటి మలైక అరోరా ఓ షోలో నేటి యువత పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. యువతలో క్రమశిక్షణ కరువు అయిందట. పైగా యువత బాగా చెడిపోతున్నారని.. వారి నిండా అసభ్యత మాత్రమే ఉంటుందని.. వారి వల్ల మిగిలిన కుటుంబ సభ్యులు కూడా తల ఎత్తుకోలేక పోతున్నారని, ఇవన్నీ మనలాంటి వ్యక్తులం చూడలేకపోతున్నాం అని మలైక అరోరా వాపోతోంది. బహుశా కలికాలం అంటే ఇదేనేమో.

మలైక అరోరా అంటేనే శృతిమించిన శృంగార సన్నివేశాలకు, బూతులకు కేరాఫ్ అడ్రెస్. కానీ, ఇలాంటివి యువతలో పెరిగిపోతున్నాయి అన్నట్లుగా మలైక అరోరా మాట్లాడడం మాత్రం, దెయ్యాలు నీతులు వల్లిస్తున్నట్లుగా ఉంది అనక తప్పదు. సినిమాల్లో విచ్చలవిడిగా నటించే మలైక అరోరా.. బయట మాత్రం యువత చాలా ఒద్దికగా కనిపించాలని సూక్తులు చెప్తోంది.

Also Read:అనౌన్స్‌మెంట్‌తోనే అంచనాలు పెంచేశాడు!

- Advertisement -